Chaaya 5th event details[11th oct 2015]
వెన్నల వెలుగులు
by Krishna mohan bau, 9848023384
శరధృతువు కి రెండు రోజులు ముందే ‘ఛాయా’ 5 వ సమావేశం లో కవి సిద్ధార్థ వెన్నలను కురిపించాడు. గుప్పెడు కవితలు, పిడికెడు కబుర్లు, సితారాగాల జల్లులతో వెలుగులు పూయించాడు. 15 యేళ్ళ తర్వాత తీసినా, సితార పరిజ్ఞానం పోలేదని రుజువు చేశాడు. 18 యేళ్ళ కింద ‘వార్త’ దిన పత్రిక లో పాకిస్తానీ గాయని, రేష్మ మీద రాసిన కవితని చదివి, పాఠకులతో పంచుకోడానికి కూడా ఒప్పుకున్నాడు.
ఆదివాసీ సంచార దేవతా
నా ఉప ఖండపు గుండెకాయ
ఎడారి లోనదిపై
రక్తాన్ని ఆదిస్తూ ...
అల్లా... అలలల్లా... లల్లా
రావేయమ్మా
నా వెన్నుపూసపై ఒక సీసం కరిగి
ఎండు వానలా మెరుస్తూ
నీ గొంతు జారుతుంది
కడుపులో చలి పిడుగు తిరుగాడుతుంది
తళ తళ మెరుస్తూ ఒక జీర
లక్షల నేనుల్ని ముక్కల ముక్కలు
నా పాక్ బంగ్లా భారతమా
శుభ్రం చెయ్యి నన్ను
ఖర్భూజా పండ్ల మామిడికాయల కాలంలో
నీ కొడుకునై పుడతాను
తడిపించు
జల్లెడ పట్టు
ఆత్మ నాడించు
చీల్చు నన్ను
నన్ను గన్న మాయమ్మా
ఆదివాసీ...ఎడారి దేవతా
మంటలంటించు రాతలకి
తడి చీకటి ఇసుక మీద
పొర్లుతూ పాడుతున్నావు
బాలింత పాము పాట నువ్వు
పోర్లాడు నా అనర్గానిక్ చితి మీద
అశృవు చెయ్యి
ఖర్జూరపు కోకిలా
సంచార దుఃఖమా
నన్నొక కొత్త దహనంలోకి కళ్ళు తెరిపించు
(రేష్మా .... మన ఎడారి కో)

No comments:
Post a Comment